🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 27 November 2026, 6:14 pm Posted by : TELANGANA KERATAM

సౌత్ జోన్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన కోరుట్ల ’రామకృష్ణ’ విద్యార్థి

News Image
సౌత్ జోన్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన కోరుట్ల ’రామకృష్ణ’ విద్యార్థి 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 27 : కేరళలోని కాలికట్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 25 నుండి నిర్వహించనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ (2026- 27) కు కోరుట్ల రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల బిబిఏ ద్వితీయ సంవత్సర విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ ముస్తాకిం శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ జట్టు తరఫున ఆడడానికి వరుసగా రెండవ సంవత్సరం ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ముస్తకింను కళాశాల కరస్పాండెంట్ యాద రామకృష్ణ, డైరెక్టర్ హరిప్రియ అంజయ్య గౌడ్, ఫిజికల్ డైరెక్టర్ దయాత్రి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్, అధ్యాపక బృందం అభినందించారు.
🏠 Home