అచ్చంపేటలో వీధి కుక్కల స్వైర విహారం.
భయాందోళనలో కాలనీవాసులు.పట్టించుకోని మున్సిపల్ అధికారులు.తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 27):నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఇంద్రానగర్ గోకుల్ నగర్ మహేంద్ర నగర్ టీచర్స్ కాలనీలలో వీధి కుక్కలు స్వైరా విహారం చేస్తున్నాయి. కుక్కలు గుంపులు గుంపులుగా విపరీతంగా తిరగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కుక్కలు గుంపులుగా ప్రధాన రహదారి వెంట సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పలుమార్లు మహిళలు, చిన్నారుల పై దాడులు చేశాయని,పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలను కట్టడి చేయాలని కోరుతున్నారు.