🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 27 November 2026, 6:31 pm Posted by : TELANGANA KERATAM

రైతుల భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రీ సర్వే దోహదం

News Image
రైతుల భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రీ సర్వే దోహదం

భూముల హద్దులపై స్పష్టతతో రైతుల మధ్య వివాదాలకు చెక్ – మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్

పడమటి సాయిగూడెంలో భూభారతి భూ రీ సర్వేపై అవగాహన సదస్సు

(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 27: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్‌కేసర్ 6వ డివిజన్ పడమటి సాయిగూడెంలో భూభారతి భూ రీ సర్వేపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేఏసీ గౌరవ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి, ఆర్డీఓ ఎన్. వెంకట్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్, ఘట్‌కేసర్ మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ముఖ్యులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ రీ సర్వే కార్యక్రమం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. భూముల రీ సర్వే ద్వారా ప్రతి రైతుకు వారి భూమికి సంబంధించిన హద్దులపై స్పష్టత వస్తుందని, తద్వారా భవిష్యత్తులో భూ వివాదాలు, పక్క రైతుల మధ్య హద్దుల సమస్యలు తలెత్తకుండా ఉంటాయని తెలిపారు. రైతులు తమ భూముల వివరాలను సరిచూసుకుని, సర్వే ప్రక్రియలో అధికారులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. భూ సర్వే నిర్వహిస్తున్న అధికారులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతులకు ఏవైనా భూ సంబంధిత సమస్యలు లేదా సందేహాలు ఉంటే నేరుగా ఆర్డీఓ ఎన్. వెంకట్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్‌ను కలిసి తమ సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవచ్చని సూచించారు. భూముల హద్దులపై స్పష్టత ఉండటం వల్ల రైతుల మధ్య అనవసర విభేదాలు తగ్గి, పరస్పర సహకారంతో ప్రశాంతంగా జీవించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వే అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సిబ్బంది, మాజీ కౌన్సిలర్ కడుపొల్ల మల్లేష్, మాజీ ఎంపీటీసీ నర్రి శ్రీశైలం, డివిజన్ ప్రధాన కార్యదర్శి రామస్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొక్క సత్తిరెడ్డి, అందేలా అవిలాష్, సాయికుమార్, రాజు, సాయి తదితర నాయకులతో పాటు పలువురు రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Additional News Photo
🏠 Home