చిన్నమడంపల్లిలో యథేచ్ఛగా మట్టి మాఫియా దందా!
చిన్నమడంపల్లిలో యథేచ్ఛగా మట్టి మాఫియా దందా!
మోకాళ్ళ రామయ్య గుంపు పరిధిలో అనుమతులు లేకుండానే మట్టి తవ్వకాలు
ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా.. పట్టించుకోని సంబంధిత అధికారులు
సింగరేణి మండలం (చిన్నమడంపల్లి):
సింగరేణి మండలం చిన్నమడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మోకాళ్ళ రామయ్య గుంపు ప్రాంతంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే అక్రమార్కులు యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు.
పట్టపగలే ఎలాంటి భయం లేకుండా ట్రాక్టర్ల ద్వారా మట్టిని అక్రమంగా తరలిస్తుండటంతో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మట్టి లోడ్‌తో తిరుగుతున్న భారీ ట్రాక్టర్ల కారణంగా గ్రామంలోని రోడ్లు ధ్వంసమవుతున్నాయని, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనుమతులు లేకుండా అక్రమ రవాణా జరుగుతున్నా రెవెన్యూ మరియు మైనింగ్ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.