🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 27 November 2026, 6:51 pm Posted by : TELANGANA KERATAM

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి

News Image
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి

చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి – ఘట్‌కేసర్ సీఐ పి. కిరణ్

ఎదులాబాద్ మేఘా ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు

(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 27: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములై, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఘట్‌కేసర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి. కిరణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్‌లోని మేఘా ఇంజనీరింగ్ కళాశాలలో ఘట్‌కేసర్ పోలీసుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన సీఐ పి. కిరణ్ మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలు, చట్టపరంగా ఎదురయ్యే పరిణామాలను వివరించారు. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి సారించి, క్రమశిక్షణతో ముందుకు సాగినప్పుడే తమ జీవిత లక్ష్యాలను చేరుకోగలరని తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసలైతే విలువైన జీవితంతో పాటు బంగారు భవిష్యత్తు కూడా నాశనమవుతుందని హెచ్చరించారు. నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు అని, యువత సరైన మార్గంలో పయనించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా, వాటికి దూరంగా ఉంటూ ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి విద్యార్థి సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తన వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే కళాశాల పరిసరాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో ఎవరైనా గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నా, వినియోగిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఇందుకోసం డయల్ 112 లేదా 1903 నంబర్లకు సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య ప్రతినిధులు, అధ్యాపకులు, ఘట్‌కేసర్ పోలీస్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
Additional News Photo
🏠 Home