🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 27 November 2026, 6:53 pm Posted by : TELANGANA KERATAM

వ్యవసాయ బోర్ల వద్ద స్టార్టర్లు వైర్ల చోరీ.

News Image
వ్యవసాయ బోర్ల వద్ద స్టార్టర్లు వైర్ల చోరీ.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 27):

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని లింగోటం గ్రామ పరిసరాలలో రైతుల బోర్ల వద్ద దొంగల బెడద ఎక్కువైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ బోర్ల వద్ద స్టార్టర్లు, విద్యుత్ వైర్లు దొంగలు అపహరిస్తున్నారని తెలిపారు. దొంగల నుంచి తప్పించుకునేందుకు పంట పొలాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లు రైతులు పేర్కొన్నారు. పోలీసులు రాత్రి వేళలో గ్రామ పరిసరాల్లో పెట్రోలింగ్ నిర్వహించి దొంగలను అరెస్టు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
🏠 Home