🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 27 November 2026, 7:02 pm Posted by : TELANGANA KERATAM

విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు తప్పులు లేకుండా చూడాలి

News Image
విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు తప్పులు లేకుండా చూడాలి 

మండల విద్యాధికారి గంగుల నరేశం

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 27 : యూ డైస్ లో ప్రతి పాఠశాల విద్యార్థుల, ఉపాధ్యాయుల వివరాలు తప్పులు లేకుండా చూడాలని కోరుట్ల మండల విద్యాధికారి గంగుల నరేశం అన్నారు. శుక్రవారం కోరుట్ల ఎమ్మార్సీలో మండల స్థాయి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కె.జి.బి.వి స్పెషల్ ఆఫీసర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లకు మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి గంగుల నరేశం మాట్లాడుతూ   ప్రతి పాఠశాల యొక్క విద్యార్థుల, ఉపాధ్యాయుల వివరాలు 
యూ డైస్-2026-2027 లో తప్పులు లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా సర్వ శిక్ష అభియాన్ కార్యక్రమాలు అయిన నషాముక్తుభారత్, ఇకో క్లబ్, ప్రహరీ క్లబ్స్ నిర్వహణ, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, రాబోయే ఎస్ఎస్సి పరీక్షలలో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రణాళికలు రచించాలని, ఈవినింగ్ క్లాసుల్లో విద్యార్థులు సరైన విధంగా చదివేలా శ్రద్ధ తీసుకోవాలన్నారు. టై, బెల్టులు, యూనిఫార్మ్స్ యొక్క సరఫరా వివరాలను ప్రధానోపాధ్యాయులు అడిగి తెలుసుకున్నారు  ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వి.గంగాధర్, భారీ, సి.ఆర్పీ పి.గంగాధర్, సి.సి.ఓ రాజేశ్వర్ లు పాల్గొన్నారు.
🏠 Home