కల్లూరు గ్రామంలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల పంపిణీ
కల్లూరు గ్రామంలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల పంపిణీ
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 27 : కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలో శుక్రవారం నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై, నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు పెన్షన్లు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి చిట్నేనీ లత - రమేష్, ఏఎంసీ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పన్నాల అంజిరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ పుల్లూరి వెంకటేష్ గౌడ్, కల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శి సరిత, గ్రామ ప్రజలు, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.