🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 27 November 2026, 7:17 pm Posted by : TELANGANA KERATAM

ఏఎంసీ చైర్పర్సన్ పదవి చెదలు రమాదేవి సత్యనారాయణకు కేటాయించాలి

News Image
ఏఎంసీ చైర్పర్సన్ పదవి చెదలు రమాదేవి సత్యనారాయణకు కేటాయించాలి 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 27 : కథలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవి మహిళా రిజర్వేషన్ కావడంతో, ఆ పదవిని చెదలు రమాదేవి సత్యనారాయణకు కేటాయించాలని కోరుతూ, కథలాపూర్ మండల సర్పంచుల ఫోరం ఆద్వర్యంలో, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమక్షంలో శుక్రవారం సర్పంచ్ లందరూ ఏకగ్రీవంగా తీర్మానించుకున్నట్లు తెలిపారు. కావున చైర్పర్సన్ పదవిని చెదలు రమాదేవి సత్యనారాయణకు కేటాయించాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మనవి చేస్తున్నట్లు, మండల కాంగ్రెస్ పార్టీ నేతలు, మండల సర్పంచులు, సర్పంచ్ ల ఫోరం నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నేతలు, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, సర్పంచ్ల ఫోరం నేతలు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home