సీఎం, మంత్రులు, నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం
సీఎం, మంత్రులు, నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 27 : కోరుట్ల పట్టణంలోని 03,వ వార్డు మాదాపూర్ కాలనీలో శుక్రవారం చేయూత పెన్షన్ లబ్ధిదారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రి సీతక్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. చేయూత పెన్షన్ ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు అందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారని, వీరందరికీ పెన్షన్లు డబ్బులు జమ కావడంతో సమాజంలో వీరు అందరు కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి మాకు చేయూత ద్వారా మమ్మల్ని బలపరచడం మాకు చాలా ఆనందంగా ఉందని లబ్ధిదారులు తెలియజేసినారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రతి కుటుంబానికి ఇందిరా బీమా పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి బీమా సౌకర్యం కల్పించడం చాలా అద్భుతమైన కార్యక్రమని తెలిపారు. అలాగే ప్రతి పేద ఇంటివారి ఇంటి కలను నిజం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో జువ్వాడి నర్సింగరావు వేల మంది ఇండ్లలో ఇందిరమ్మ ఇల్లు దీపావళి కాంతుల పండగలు నిర్వహించుకున్న సందర్భంగా తెలియజేసినారు మహిళలకు ఉచిత ప్రయాణం తెలంగాణ మహిళలందరినీ కోటీశ్వరులను చేసే కార్యక్రమం, ఇందిరమ్మ చీరల వంటి కార్యక్రమాల ద్వారా మహిళలు ఆనందంతో ఉన్నారని తెలిపారు. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు ఇంకా అనేక మైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేయూత లబ్ధిదారులు, కాలనీవాసులు మోత్కూరు నగేష్, మస్రత్ అలీ, కాయల అరవింద్,మాధవి కొండ్లెపు షేక్ ముఖిమ్ ఎండి మెహరాజ్, ఎండి ఖలీమ్ ఎండి నయీమ్, ఎస్డి మహమూద్ షేక్ జాకీర్, ఎండి జావిద్, ఎస్ కే ముజీబ్, ఎండి జాకీర్, లక్ష్మీనారాయణ, రాములు, నాగమ్మ, లక్ష్మి, రాజు తదితరులు పాల్గొన్నారు