🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 27 November 2026, 7:40 pm Posted by : TELANGANA KERATAM

డప్పు చప్పుళ్ళతో ఛలో కరీంనగర్ కు ఆహ్వానం పలికిన బిఆర్ఎస్ నాయకులు

News Image
డప్పు చప్పుళ్ళతో ఛలో కరీంనగర్ కు ఆహ్వానం పలికిన బిఆర్ఎస్ నాయకులు 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 27 : బిఆర్ఎస్ పార్టీ వేములవాడ ఇంచార్జి చల్మడ లక్ష్మి నరసింహ రావు ఆదేశాల మేరకు శుక్రవారం భీమారం మండలంలోని మన్నేగుడెం గ్రామంలో డప్పు చప్పుళ్ళతో ఊరేగింపుగా, గ్రామ కార్యకర్తలతో ర్యాలీగా బయలు దేరి, ప్రజలకు బొట్టు పెడుతూ ఛలో కరీంనగర్ కు బిఆర్ఎస్ నాయకులు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..ఆనాడు కేసిఆర్ దీక్ష దివస్ నవంబర్ 29,న దీక్ష చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాగోజిపెట్ సర్పంచ్ చెన్నమనేని అజిత్ రావు, రాజ లింగపేట సర్పంచ్ గాగోజి చారి, ఈదుల లింగపెట సర్పంచ్ వెల్మల సుప్రియ - హరీష్, రంగాపూర్ సర్పంచ్ మకిలి కావేరి - కుమార స్వామి, భీమారం మండల యువ నాయకులు చెక్కపల్లి రఘు, మన్నేగుడెం ఉపసర్పంచ్ తేలు రాజేందర్, సతీష్ రెడ్డి, మహేష్, అశోక్, ప్రదీఫ్, నరేష్, శేఖర్, రాజు, నర్సయ్య, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home