శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఆహ్వానించిన టేక్రియాల్ గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఆహ్వానించిన టేక్రియాల్ గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 27:
కామారెడ్డి నియోజకవర్గంలోని టేక్రియాల్ గ్రామంలో నిర్వహించనున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ టేక్రియాల్ గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించనున్న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమ వివరాలను తెలియజేస్తూ, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన గ్రామ పెద్దలకు, ఆలయ కమిటీ సభ్యులకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.