నూతన పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సంబరాల్లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు
నూతన పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సంబరాల్లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 27 : కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో పెన్షన్, ఇందిరమ్మ ఇండ్ల పథకాల నూతన లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న సంబరాల్లో, లబ్ధిదారుల ఆహ్వానం మేరకు జువ్వాడి కృష్ణారావు సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి నేటి వరకు ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అంశాల్లో ఎటువంటి రాజీ లేకుండా కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం సంయుక్తంగా కలిసి పనిచేస్తూ, రాష్ట్రంలోని మారుమూల పల్లె నుంచి రాష్ట్ర రాజధాని వరకు అన్ని రంగాల్లో రాష్ట్రం ప్రగతి పథంలో ఉండే విధంగా కృషి చేస్తున్న విధానం పట్ల జువ్వాడి కృష్ణారావు సంతోషం వ్యక్తం చేస్తూ, నూతన పెన్షన్ లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, గ్రామ పంచాయతీ సర్పంచ్ ద్యాగ గంగాధర్, పాలకవర్గానికి, గ్రామ కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంబరాల్లో కోరుట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పన్నాల అంజి రెడ్డి, గ్రామ సర్పంచ్ ద్యాగ గంగాధర్, ఉప సర్పంచ్ పిట్టల రాజేశ్వరి శ్రీనివాస్, శ్రీ వెంకటేశ్వర ఆలయ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీటీసీ బర్కం నర్సయ్య, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు బర్కం చిట్టి బాబు, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కటుకం రాజేష్, మాజీ ఉప సర్పంచ్ విఠల్ రవీందర్ రెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు వార్డు సభ్యులు, మండల కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు నబీ, ఆలయ కమిటీ ధర్మకర్త ద్యాగ రాజిరెడ్డి, వార్డు సభ్యులు బర్కం బక్కన్న, సంజీవ్, ఆలయ కమిటీ మాజీ చైర్మెన్ ఏనుగందుల రమేష్, కాంగ్రెస్ నాయకులు సయ్యద్, రసత్ పాషా, ముహమ్మద్ నసీర్, ప్రిన్స్ ఫరూక్, నవాజ్, రయబోస్, అనుమల్ల రమణ, కట్ట వెంకటేశం, లబ్ధిదారులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.