రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అధికారులు
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 27, నవంబర్ రూ.4.50 లక్షల కాంట్రాక్టు బిల్లు మంజూరుకు లంచం డిమాండ్సదాశివపేట మున్సిపాలిటీలో ఏసీబీ అధికారుల మెరుపు దాడి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. రూ.15 వేల లంచం తీసుకుంటూ ఇద్దరు మున్సిపల్ అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.ఏసీబీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. సదాశివపేట మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఏ. రాజేష్ కుమార్, అవుట్సోర్సింగ్ విధానంలో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఏ. శివారెడ్డి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.సదాశివపేట పట్టణంలోని ఊబ చెరువులో 2026 గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి చేపట్టిన పూడికతీత పనులకు గాను రూ.4.50 లక్షల కాంట్రాక్టు బిల్లును ఇప్పటికే మంజూరు చేసి ప్రాసెస్ చేసినందుకు ప్రతిఫలంగా ఫిర్యాదుదారుడిని రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.
ఈ క్రమంలో నవంబర్ 27న మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో ఏసీబీ అధికారులు వలపన్ని లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ ఇంజనీర్ రాజేష్ కుమార్‌ను పట్టుకున్నారు. ఆయన లంచం మొత్తాన్ని వర్క్ ఇన్స్పెక్టర్ శివారెడ్డికి భద్రపరచడానికి అప్పగించగా, ఆ నగదును శివారెడ్డి వద్ద నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఇద్దరు అధికారులు తమ విధులను నిజాయితీగా నిర్వహించకుండా అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. నిందితులను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.సదాశివపేట మున్సిపాలిటీలో ఏసీబీ చర్యలు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.