🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 28 November 2026, 4:45 pm Posted by : TELANGANA KERATAM

మద్దిమడుగులో ఘనంగా అఖండ భజన వేడుకలు.

News Image
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 28):నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నల్లమల ప్రాంతం లో గల కృష్ణ నది తీరాన వెలసిన పుణ్యక్షేత్రం మద్దిమడుగులో కార్తిక మాసం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు నిత్య స్వామీ స్మరణ జరుగుతుందని ఆలయ ఈవో శాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు. 15 బృందాలతో అఖండ భజన చేస్తున్నట్లు పర్యవేక్షకులు హనుమంతు, ఉప సర్పంచ్ లక్ష్మయ్య, వెంకటేష్, ప్రధాన అర్చకులు వీరయ్య శాస్త్రి వివిధ గ్రామాల నుంచి వచ్చిన బృందాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
🏠 Home