చలో ఢిల్లీ గోడపత్రిక విడుదల.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 28):కార్మికుల సమస్యల పరిష్కారం హక్కుల సాధన కోసం డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం.శంకర్ నాయక్ శనివారం కార్మికులకు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ కూడాలి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన చలో ఢిల్లీ గోడపత్రికను కార్మికులతో కలిసి విడుదల చేశారు.