శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 28):నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ ఉన్న కళాశాల భవనం శిథిలావస్థకు చేరింది. కళాశాల భవనం ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించి ఉండడంతో భవనం పగుళ్లు ఏర్పడి పెచ్చులు రాలిపోతున్నాయి. భవనం ఎప్పుడు కులుతుందో తెలియని పరిస్థితి ఉందని విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నూతన భవనాన్ని నిర్మించే విధంగా చొరవ తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.