🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 28 November 2026, 4:56 pm Posted by : TELANGANA KERATAM

విద్య విముక్తికి ఆయుధం – కులవివక్ష నిర్మూలనకు యువత కృషి చేయాలి: పాలడుగు నాగార్జున

News Image
తెలంగాణ కెరటం నల్గొండ జిల్లా ప్రతినిధి (నవంబర్28);మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని విద్య, సామాజిక సమానత్వం, మహిళా సాధికారత కోసం కృషి చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు.స్థానిక నల్గొండ బీసీ హాస్టల్‌లో మహాత్మా జ్యోతిబా ఫూలే 136వ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జ్యోతిబా ఫూలే తన జీవితాన్ని అణగారిన వర్గాల విముక్తి కోసం, మహిళా విద్యాభివృద్ధి కోసం, కులవివక్ష నిర్మూలన కోసం అంకితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు.1873లో రచించిన గులాంగిరి పుస్తకం ద్వారా కులవ్యవస్థలోని అసమానతలను ఎండగట్టి, శూద్ర, అతిశూద్రుల ఐక్యతను, విద్య ప్రాధాన్యతను, స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం ఆవశ్యకతను సమాజానికి చాటిచెప్పారని తెలిపారు. తన సహచరి సావిత్రిబాయి ఫూలేతో కలిసి మహిళా విద్యకు పునాదులు వేసి, బాలికల విద్య కోసం అనేక అవరోధాలను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.నేటికీ సమాజంలో కులవివక్ష, అంటరానితనం, మహిళలపై హింస, విద్యలో అసమానతలు కొనసాగుతున్నాయని, వాటి నిర్మూలనకు యువత ముందుకు రావాలని కోరారు. కులం పేరుతో మనుషులను విడదీయకుండా శాస్త్రీయ దృక్పథంతో, రాజ్యాంగ విలువలతో సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యను ఆయుధంగా చేసుకొని అజ్ఞానాన్ని, కులవివక్షను పారద్రోలడమే మహాత్మా జ్యోతిబా ఫూలేకు మనం అర్పించే నిజమైన నివాళి పాలడుగు నాగార్జున పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ పట్టణ కార్యదర్శి నరసింహ లక్ష్మణ్ రమేష్ నరేష్ శ్రీనివాసు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home