🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 28 November 2026, 4:59 pm Posted by : TELANGANA KERATAM

ముధోల్ గ్రామంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ బుక్స్ పంపిణీ

News Image
తెలంగాణ కెరటంనిర్మల్ జిల్లా ప్రతినిధి లక్ష్మణ్ 
నిర్మల్ జిల్లా ముధోల్ గ్రామంలో విద్యార్థుల విద్యాభివృద్ధిని ప్రోత్సహిస్తూ, ప్రజా ట్రస్ట్ తరఫున చైర్మన్ బోస్లే మోహన్‌రావు పాటిల్ ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించరు.ముధోల్ గ్రామంలోని ఆశ్రమ బాలురుల హై స్కూల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ZPHS ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రవీంద్ర ప్రైవేట్ స్కూల్, శిశుమందిర్ పాఠశాల, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల మరియు MJPTBCW రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా ఆల్ ఇన్ వన్ బుక్స్ స్టడీ మెటీరియల్ అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలను, ఇంటర్ విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను అందజేయడం జరిగింది.విద్యార్థులు అందించిన పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకొని, శ్రద్ధతో చదివి మంచి ఫలితాలు సాధించి, ఉన్నత విద్యను అభ్యసించి తమ భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ప్రజా ట్రస్ట్ చైర్మన్ శ్రీ బోస్లే మోహన్‌రావు పాటిల్ ఆకాంక్షించారు.విద్యార్థుల చదువుకు అండగా నిలుస్తూ, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలనే లక్ష్యంతో ప్రజా ట్రస్ట్ చేపట్టిన ఈ విద్యా సహాయ కార్యక్రమం ఎంతో అభినందనీయం.విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రజా ట్రస్ట్ చైర్మన్ శ్రీ బోస్లే మోహన్‌రావు పాటిల్ చేస్తున్న కృషికి పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
Additional News Photo
🏠 Home