రాష్ట్రస్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌కు కోరటికల్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థుల ఎంపిక
మామడ మండలం PM SHRI ZPHS కోరటికల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌కు ఎంపికయ్యారు. విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ, రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.