🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 28 November 2026, 5:13 pm Posted by : TELANGANA KERATAM

సీఎం బహిరంగ సభను ఎన్నికల సభగా మార్చారు.

News Image
సభలో గిరిజన ఆదివాసీ నాయకులను అవమానపరిచారు.మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 28):నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నోటికి వచ్చినట్లు అసభ్యకర భాషను మాట్లాడాడని ఇది సీఎం హోదాకు ఏమాత్రం తగదని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు గువ్వల బాలరాజు అన్నారు. అచ్చంపేట పట్టణంలో అధికారిక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజాధనంతో కాంగ్రెస్ ఎన్నికల సభగా మార్చడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయ సభలు పెట్టుకోవాలంటే సొంత డబ్బులతో పెట్టుకోవాలి తప్ప ప్రజల సొమ్ముతో కాదని హితవు పలికారు. ఆ సభలో దళిత గిరిజన, ఆదివాసి నాయకులను మాట్లాడనివ్వకుండా మన పరిచారని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రసంగాన్ని సైతం అడ్డుకోవడం తీవ్రంగా ఖండించారు. కానీ రాజకీయ ఒత్తిళ్లకు తొలగి ఉమ్మడి పాలమూరు జిల్లాను ఎండబెట్టి అక్రమంగానే తరలిస్తామంటే మాత్రం పాలమూరు రైతాంగం చూస్తూ ఊరుకోదని అన్నారు.పాలమూరు రైతుల ఆకాంక్షలపై ఒక్క మాట కూడా మాట్లాడని సీఎం వైఖరి కి రైతులు తగిన బుద్ధి చెప్పగా తప్పదని హెచ్చరించారు.
🏠 Home