గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హన్మకొండ ప్రతినిధి: తెలంగాణ కెరటం నవంబర్ 28 హన్మకొండ నగరానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా నీట్ గెస్ట్ హౌస్లో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ కు పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం కొద్దిసేపు మర్యాదపూర్వకంగా ముచ్చటించారు.