🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 28 November 2026, 6:28 pm Posted by : TELANGANA KERATAM

మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.

News Image
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 28):బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం అవిశ్రాంతంగా కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త, సామాజిక సమానత్వ పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా శనివారం జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు, సమాజంలో సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల సాధనకు ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలోఅంబేద్కర్ యువజన సంఘం డివిజన్ అధ్యక్షులు పాతుకుల శ్రీశైలం,జక్క కిష్టయ్య, విజయమోహన్, కళాకారుడు జక్క గోపాల్, శ్రీనివాస్, నరేష్ యాదవ్,ఎం.డి. సయ్యద్ అశోక్, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home