🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 28 November 2026, 6:59 pm Posted by : TELANGANA KERATAM

వెల్దుర్తి నెల్లూరులో ఎల్ నినోపై అవగాహన గ్రామసభ

News Image
తెలంగాణ కెరటం వెల్దుర్తి ప్రతినిధి నవంబర్ 28
వెల్దుర్తి మండలం నెల్లూరు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎల్ నినోపై అవగాహన గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఆరుతడి పంటలపై అవగాహన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా అధికారులు ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు వివరంగా అవగాహన కల్పించారు. తక్కువ నీటితో పండే పంటలు ఎంచుకోవడం, నేల తేమను కాపాడుకోవడం, సకాలంలో విత్తనాలు వేయడం వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు. రైతులు అడిగిన సందేహాలకు అధికారులు సమాధానాలు చెప్పారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో విగ్నేశ్వర్, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
🏠 Home