🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 28 November 2026, 7:18 pm Posted by : TELANGANA KERATAM

పరీక్షను యుద్ధంలా భావించండి.. ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా, పట్టుదలను కవచంగా చేసుకోండి

News Image

రేపటి పరీక్ష మీ విజయానికి పునాది కావాలి

ఎస్సై ప్రిలిమ్స్ అభ్యర్థులకు "ఆల్ ది బెస్ట్" చెప్పిన మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ తెలంగాణ కెరటం చేగుంట ప్రతినిధి నవంబర్ 28 ఎన్నో రోజుల కష్టం, మరెన్నో రాత్రులు నిద్రలేని చదువు.. రేపు మీ విజయానికి పునాది కావాలని మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు మనోధైర్యం కల్పించారు.ఈ నెల 29న ఎస్సై ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్ష ఉంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరీక్షను యుద్ధంలా భావించండి.. ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా, పట్టుదలను కవచంగా చేసుకోండి. ప్రశ్నపత్రం కఠినంగా ఉన్నా.. మీ సంకల్పం దానికంటే బలంగా ఉండాలి. ఒక్క పరీక్ష మీ జీవితాన్ని నిర్ణయించదు.. కానీ మీ జీవితాన్ని మార్చే అవకాశం మాత్రం ఇదే కావచ్చు అని ప్రోత్సహించారు.మీ తల్లిదండ్రుల ఆశలు, మీ కుటుంబం కలలు, మీ కష్టం... అన్నీ మీ విజయానికి స్ఫూర్తిగా నిలవాలి. తొందరపడకుండా, ప్రశాంతంగా ఆలోచించి, తెలిసిన ప్రశ్నలకు ఆత్మవిశ్వాసంతో సమాధానాలు రాయండి. ఖాకీ యూనిఫాం కేవలం ఉద్యోగం కాదు.. అది బాధ్యత, క్రమశిక్షణ, సమాజానికి సేవ చేసే అవకాశం. మీ కలల కోసం మీరు చేసిన పోరాటానికి రేపటి పరీక్ష తొలి విజయ సంకేతం కావాలి. మీ కల నెరవేరాలి అని ఆకాంక్షించారు.

🏠 Home