🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 28 November 2026, 7:24 pm Posted by : TELANGANA KERATAM

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి.

News Image

 మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. మద్యపానం నియంత్రించాలి 

 డ్రగ్స్ ను పూర్తిగా అరికట్టాలి. 
అశ్లీల చిత్రాలు సినిమాలపై సెన్సార్ విధించాలి.

 ఆడపిల్లలను పుట్టనిద్దాం. ఎదగనిద్దాం. చదవనిద్దాం.
అన్నారు.
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల హాస్టల్లో సందర్శించి సెమినార్ ఐద్వా జిల్లా కార్యదర్శి అనసూయ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి పాల్గొని మాట్లాడుతూ....దేశంలో రోజురోజుకు మహిళలపై విద్యార్థినిలపై హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దీనికి మూల కారణం ప్రభుత్వ పాలకుల అనుసరిస్తున్న విధానాలు కారణమన్నారు. 

దేశంలో మారుమూల గ్రామాల వరకు మద్య పానీయం ఏరులై పారుతుంది నియంత్రించాలి. 
 డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోతుంది అరికట్టాలి.
అశ్లీల చిత్రాలు అశ్లీల పోస్టర్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. వాటిని అరికట్టాలి. సెన్సార్ విధించాలి.అందరం కలిసికట్టుగా వయసుతో నిమిత్తం లేకుండా మహిళల సమస్యలపై పోరాటం చేద్దామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
నేటికీ దేశంలో రాష్ట్రంలో మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఉన్న బాలికల సొంత కళాశాల హాస్టల్ భవనాలు లేవు. ప్రైవేటు భవనాలలో ఉన్న కనీస సౌకర్యాలు సక్రమంగా లేవు. ఈ పాలకులు చెప్పుతున్నది ఒకటి చేస్తున్నది ఒకటి మన సమస్యలు పరిష్కారం కావాలంటే మనమందరం చదువుతూ మన సమస్యల పరిష్కారాo కోసం నిరంతరం పోరాటాలు చేసి ప్రభుత్వాల మెడలు వంచి సాధించుకోవాలన్నారు. హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మెనూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని పాలకులకు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటర్ డిగ్రీ పీజీ బీఎడ్ విద్యార్థులు పాల్గొన్నారు.
Additional News Photo
🏠 Home