ఈటలపై విమర్శలు చేస్తే సహించేది లేదు! కౌశిక్ రెడ్డికి బీజేపీ నాయకుల హెచ్చరిక
హుజురాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం.. ఈటల హయాంలోనే నియోజకవర్గానికి మహర్దశ
హన్మకొండ ప్రతినిధి:తెలంగాణ కెరటం నవంబర్ 28 హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎంపీ ఈటల రాజేందర్‌పై చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఈటల రాజేందర్ చేసిన కృషి ప్రజలకు తెలిసిందేనని, ఆయనపై విమర్శలు చేసే స్థాయి కౌశిక్ రెడ్డికి లేదని మండిపడ్డారు. ఈటల రాజేందర్‌పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
కమలాపూర్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్, బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్, బండి కళాధర్ తదితరులు మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కనిపిస్తున్న రహదారులు, ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రుల అభివృద్ధిలో ఈటల రాజేందర్ పాత్ర కీలకమని పేర్కొన్నారు. కేవలం అధికారంలో ఉన్నప్పుడే కాకుండా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.తన సొంత గ్రామానికే రోడ్డు వేయించలేని కౌశిక్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. అభివృద్ధిపై మాట్లాడే ముందు తన పాలనలో నియోజకవర్గానికి తీసుకొచ్చిన నిధులు, చేసిన పనులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.కేసీఆర్ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందని, అదే నిజమైతే రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలు ఎందుకు అదే స్థాయిలో అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు. అక్రమ మార్గంలో పదవి పొందిన వ్యక్తి ఈటల వంటి ప్రజా నాయకుడిపై విమర్శలు చేయడం తగదని అన్నారు. ఈటలపై విమర్శలు చేస్తే ఆకాశంపై ఉమ్మి వేసినట్లేనని, చివరకు అవి విమర్శలు చేసిన వారిపైనే పడతాయని ఎద్దేవా చేశారు.ఇప్పటివరకు సంయమనం పాటించామని, ఇకనైనా ఈటల రాజేందర్‌పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో శనిగరం సర్పంచ్ కొత్తపల్లి రాజు, బుర్ర కరుణాకర్, తుమ్మ శోభన్ బాబు, కనుకుంట్ల అరవింద్, కొండం శ్రీనివాస్, ఇనుగాల రత్నాకర్, పెండ్యాల తిరుపతిరెడ్డి, తూర్పాటి భాస్కర్, పుల్ల అద్భుతరావు, మార్క అశోక్, పిల్లి సతీష్, రాంశెట్టి రాజయ్య, పంజాల సారయ్య, చెలిక శ్రీనివాస్, మౌటం రమేష్ బాబు, అర్వపల్లి సామ్రాజ్యం గౌడ్, కొండమీది రవి, తూర్పాటి క్రాంతి, మౌటం సుభాష్, జక్కుల రమేష్, మునిగే రాజు, రాణప్రతాప్, ఓదెలు, సాంబయ్య, మౌటం సంపత్, ర్యాకం సంపత్, కట్కూరి శంకర్, పచ్చిమట్ల కుమారస్వామి, బైరీ రాజేష్, చేనుమల్ల రంజిత్, ప్రభాకర్ రెడ్డి, సుమన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.