దీక్షా దివస్ సభకు బిఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి రావాలి
దీక్షా దివస్ సభకు బిఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి రావాలి
సభను విజయవంతం చేసి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటుదాం..
బిఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు నత్తి రాజ్ కుమార్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 28 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29,న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టమని సర్పరాజ్‌పూర్ గ్రామ సర్పంచ్, మండల బిఆర్ఎస్ యువజన అధ్యక్షుడు నత్తి రాజ్ కుమార్ అన్నారు. ఈ చారిత్రాత్మక దీక్షకు గుర్తుగా నిర్వహించే దీక్షా దివస్ సందర్భంగా నవంబర్ 29,న కరీంనగర్ జిల్లా అలుగునూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేసిన పోరాటం, త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించే ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, తెలంగాణ ఉద్యమ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని నత్తి రాజ్ కుమార్ కోరారు.