మహాత్మా జ్యోతిబా ఫూలేకు మన ముదిరాజ్ మహాసభ నేతల ఘన నివాళులు. హైదరాబాద్ నవంబర్ 28 (న్యూస్) : బ డుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి బీసీ సామాజిక వర్గాన్ని రాజకీయంగా ఎదగడానికి అనాలే కృషి చేసిన మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాలను సదా కొనసాగించాలని మొన్న ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చొప్పర శంకర్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి సలీంద్ర శివయోమకు రాజులు పిలుపునిచ్చారు. ఈ మేరకు కు మహాత్మ జ్యోతిబాపూలే 136వ వర్ధంతిని పురస్కరించుకొని హిమాయత్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ ముదిరాజ్ మాట్లాడుతూ సుమారు 200 ఏళ్ల నాడే బీసీలకు రాజ్యాధికారం రావాలని కాంక్ష ఉన్న ఏకైక వ్యక్తి మహాత్మ జ్యోతిబాపూలేనని అదేవిధంగా పేదలకు విద్యను అందించడంలో ఆయన సతీమణి సావిత్రి ఫూలే నని ఇద్దరు దంపతులు కలిసి సమాజాభివృద్ధి కోసం చేసిన కృషి సూర్యచంద్రులు ఉన్నంతవరకు మరిచిపోలేనిదని అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకొని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా జ్యోతిబాపూలే సేవలను ముదిరాజ్ మహాసభ నేతలు కొనియాడారు ఈ కార్యక్రమంలో మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల గంగాధర్, తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు కోల జనార్దన్ గౌడ్ ఇట్టే ప్రభాకర్ తదితరులు ఉన్నారు.