🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 28 November 2026, 7:51 pm Posted by : TELANGANA KERATAM

వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి

News Image
వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి
 
 ప్రభుత్వ వడ్ల కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉండాలి. 
    తుడుందెబ్బ డిమాండ్.

ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణకెరటం) నవంబర్ 28:


ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అత్యవసర సమావేశం శనివారం వాజేడు మండల కేంద్రంలో కొమరం భీమ్ ప్రాంగణంలో మండల
అధ్యక్షులు కనితి వెంకటకృష్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు సిద్ధబోయిన సర్వేశ్వరరావు  మాట్లాడుతూ, వరికోతలు కోసి నెల రోజులు గడుస్తున్నా, వడ్ల కొనుగోలు కేంద్రాల లో వడ్లు కొనకపోవడం వలన గ్రామాల్లోకి దళారులు వచ్చి క్వింటాల్ కి 2400/- ఉన్న వడ్ల కి ,1600/- నుంచి 1800/- కి కొంటున్నారని దీని వలన రైతులు క్వింటాల్ కి సుమారు 800/- రూ.లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ములుగు జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయినా, రైతులకు అందుబాటులో లేకపోవడం, మిల్లర్లు కూడా రైతుల పక్షాన ఆ లో శించకపోవడం, అలాట్ చేయలేదనే కారణం తో వడ్లు కొనుగోలు లు చేయడం లేదని, వర్షాల ప్రభావం, ఆర్ధిక ఇబ్బందులు వలన రైతులు తమ పంటను తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని, దళారులు కొన్న పంట కు డబ్బులు కూడా సరియైన సమయం కి ఇవ్వకపోవడం తో రైతులు ఆర్ధికం గా కూడా నష్టపోతున్నారని అన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో జిల్లా కమిటీ బాధ్యులు చింత సోమరాజు, కబ్బాక రామన్న, కణితి ప్రశాంత్  తదితరులు పాల్గొన్నారు.
🏠 Home