🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 28 November 2026, 7:54 pm Posted by : TELANGANA KERATAM

పెద్దేముల్ గురుకులలో ప్యానల్ బృందం తనిఖీ

News Image
పెద్దేముల్ గురుకులలో ప్యానల్ బృందం తనిఖీ 

- గురుకులం సందర్శించిన ప్యానల్ బృందం 
- ఉపాధ్యాయుల పాఠాల తనిఖీ
- ప్రత్యేక ఆకర్షణగా లైబ్రరీ
- వివిధ పద్ధతుల్లో బోధన
- ప్రిన్సిపల్ అశోక్ ని అభినందించిన బృందం 


 తెలంగాణ కెరటం,తాండూర్ ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని పెద్దేముల్ గురుకుల పాఠశాలలో నిన్న ప్యానల్ బృందం తనిఖీ చేసింది. ప్యానల్ వెరిఫికేషన్ కి జినుగుర్తి మోడల్ స్కూల్ కి సంబంధించిన ప్రకాష్, వనజ, ఆంజనేయులు, మరియు కందనెల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు సంబంధించిన రాధాకృష్ణ, తదితరులు ఈ బృందంలో ఉన్నారు. ప్రతి సంవత్సరం గురుకుల పాఠశాలలో పానెల్ వెరిఫికేషన్ హెడ్ ఆఫీస్ వాళ్ళ ఆదేశాలతో నిర్వహిస్తారు. ఇందులో పాఠశాలలను ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని రిజిస్టర్లు తనిఖీ చేస్తారు. అదేవిధంగా ఉపాధ్యాయులు బోధించే బోధన విధానాన్ని కూడా పరిశీలిస్తారు. నూతన బోధన ఏదైనా ఉందో అని కూడా తెలుసుకుంటారు. బోధన పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రతి ఉపాధ్యాయుడు బోధించే విధానాలను నమోదు చేస్తారు. ఉపాధ్యాయులు బోధించిన దాన్నిబట్టి వాళ్లకు ప్రగతి నివేదిక ఇస్తారు. అదేవిధంగా క్లాస్ రూమ్ మరియు విద్యార్థులు ఉన్న విధానాలను కూడా పరిశీలిస్తారు.
వివిధ పద్ధతుల్లో ఉపాధ్యాయుల బోధన
 గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అశోక్ పాఠశాల రిజిస్టర్లు చక్కగా మెయింటెనెన్స్ చేశారని ప్యానెల్ తనికి వాళ్లు తెలిపారు. విద్యార్థుల క్రమశిక్షణ ఎంతో బాగుందని పేర్కొన్నారు. మెగా అసెంబ్లీ చాలా బాగా నిర్వహిస్తున్నారని ప్రిన్సిపల్ అశోక్ ని అభినందించారు.సాంఘిక శాస్త్రానికి జునుగుర్తి మోడల్ స్కూల్ కి సంబంధించిన ప్రకాష్ గౌడ్ పర్యవేక్షణ చేశారు. సాంఘిక శాస్త్రం బోధన పద్ధతులు, వాడిన బోధనోపకరణాలు చాలా బాగున్నాయని తెలిపారు. తెలుగు పర్యవేక్షణ చేసిన వనజ, వివిధ రకాల బోధన పద్ధతులను,బోధన ఉపకరణాలను చూసి ఎంతో అభినందించారు. గణిత శాస్త్రంలో కూడా ఉపాధ్యాయులు నూతన పద్ధతులలోనీ ( కృత్యాధార పద్ధతి ) బోధన ఎంతో ఆకర్షణగా నిలిచింది. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా బోధించారని పేర్కొన్నారు. ఇంగ్లీష్ లో అయితే ఉపాధ్యాయుల బోధన ఎంతో బాగుందని తెలిపారు. హిందీలో బోధన పద్ధతి ఎంతో బాగుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అశోక్,వైస్ ప్రిన్సిపాల్ ఉపేందర్, జ్యోతి, వాసంతి, మహేష్, సర్పరాజ్, ముంతాజ్, బబ్లు,సునీత, రజిత, విజయలక్ష్మి, హరీష్ రెడ్డి, ప్రవీణ్,నాగరాజ్,ప్రకాష్, మొగులయ్య, లైబ్రరీయన్ కృష్ణవేణి, పూర్ణిమ, పీఈటి నరేష్,మహిజాబీన్, శివకుమార్, దిల్షాన్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
 ప్రత్యేక ఆకర్షణగా లైబ్రరీ
అయితే పెద్దేముల్ గురుకుల పాఠశాలలో నిర్వహించిన ప్యానల్ బృందం తనిఖీల్లో లైబ్రరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అదేవిధంగా లైబ్రరీలో వివిధ రకాల చార్టులు, రిజిస్టర్లు, విద్యార్థుల, ఉపాధ్యాయుల వ్యక్తిగత నమోదు, వివిధ రకాల డిజైన్తో ప్రత్యేక ఆకర్షణగా ఉందని తెలిపారు. పుస్తకాల అమరిక చాలా బాగుందని అన్నారు. రిజిస్టర్ల నమోదు,నిర్వహణ చక్కగా ఉందని వివరించారు. వాటిని చూసి ప్యానల్ బృందానికి సంబంధించిన ఉపాధ్యాయులు ఫోటోలు తీసుకున్నారు. లైబ్రరీ ఇలా ఉంటే విద్యార్థులు ఎంతో అట్రాక్షన్ గా వచ్చి చదువుకుంటారు అని పేర్కొన్నారు.
🏠 Home