అనగారిన కులాలకు మార్గదర్శి మహాత్మ జ్యోతిరావు పూలే!
తెలంగాణ కెరటం పూలే పోరాటాల ఫలితంగానే అణగారిన వర్గాలకు విద్యా వెలుగులు చిన్నకోడూర్ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు చిన్నకోడూర్: అణగారిన కులాల అభ్యున్నతికి, విద్యా వికాసానికి విశేష కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే సామాజిక మార్గదర్శి అని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడికాయల వెంకటేశం అన్నారు.మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా చిన్నకోడూర్ మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన పోరాటాల ఫలితంగానే అణగారిన వర్గాలకు విద్యా అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం సాధ్యమవుతాయని నమ్మిన పూలే, తన జీవితాన్ని సామాజిక మార్పు కోసం అంకితం చేశారని కొనియాడారు.మహిళలకు విద్య అందించాలనే గొప్ప సంకల్పంతో పాఠశాలలను స్థాపించి, తన సతీమణి సావిత్రిబాయి పూలే ద్వారా బాలికలకు విద్యను అందించిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని అన్నారు. అణగారిన వర్గాల విద్యా హక్కుల కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.పూలే ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మేడికాయల వెంకటేశం, చెరుకు పెద్దలు, సర్పంచ్ రేగుల దేవయ్య, యాట రాజేష్, జంగిటి ఆనందం, చెరుకు నారాయణ, ఉప్పర బోయిన సంతోష్, ఇట్టబోయిన బాల పోశయ్య, ఎయ్య రాములు, సతీష్ , గణేష్, పర్షరాములు, తదితరులు పాల్గొన్నారు.