🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 28 November 2026, 8:32 pm Posted by : TELANGANA KERATAM

రామ్‌టెక్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

News Image
రామ్‌టెక్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

 
ముధోల్ మండలం, రామ్‌టెక్ గ్రామానికి చెందిన బైరోళ్ల మమత - సాయినాథ్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం శనివారం ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీటీసీ మరియు ముధోల్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల గంగారెడ్డి నూతన గృహంలోకి అడుగుపెట్టి దంపతులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బి. గంగాధర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి (సెక్రటరీ), మాజీ సర్పంచ్ భుజంగరావు పటేల్, మాజీ ఉపసర్పంచ్ భోజరామ్, స్థానిక నాయకులు భూమన్న, వాజిద్, గణేష్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Additional News Photo
🏠 Home