🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 28 November 2026, 9:11 pm Posted by : TELANGANA KERATAM

పేద మహిళలే టార్గెట్: అండాల అక్రమ రవాణా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

News Image

అండాల అక్రమ సేకరణ కేసులో దర్యాప్తు విస్తృతం
ప్రధాన నిందితుడి విచారణలో వెలుగులోకి కీలక ఆధారాలు

 హైదరాబాద్‌లోని ఒయాసిస్ కార్పొరేట్ ఆఫీసులో పోలీసుల తనిఖీలు 

వ్యవస్థీకృత ముఠాలు, ఫర్టిలిటీ కేంద్రాల పాత్రపై లోతుగా విచారణ

నకిలీ పత్రాలు, ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించిన పోలీసులు

తెలంగాణ కెరటం నగరంలో సంచలనం సృష్టించిన అండాల అక్రమ సేకరణ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది కేవలం కొందరి వ్యక్తిగత వ్యవహారం కాదని, దీని వెనుక వ్యవస్థీకృత ముఠాలు, పలు ఫర్టిలిటీ కేంద్రాల ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో దర్యాప్తును అన్ని కోణాల్లో విస్తృతం చేశారు. పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని, డబ్బు ఆశ చూపి, వారిని ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించి అండాలను సేకరిస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితుడు ఎమిరిశెట్టి దుర్గాప్రసాద్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా, కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు రాబట్టేందుకు అతడిని అదనపు కస్టడీకి తీసుకున్నామని పోలీసులు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలను ఫర్టిలిటీ కేంద్రాలు, ఏఆర్టీ బ్యాంకులకు పరిచయం చేయడంలో దుర్గాప్రసాద్ పాత్ర ఎంతవరకు ఉంది? అతడికి గల పరిచయాలు, ఆర్థిక లావాదేవీలు, ఈ దందాలో భాగస్వాములైన ఇతర సహచరుల వివరాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు.విచారణలో భాగంగా పోలీసులు హైదరాబాద్‌లోని ఒయాసిస్ హాస్పిటల్స్ కార్పొరేట్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ల్యాప్‌టాప్‌లు, ఇతర డిజిటల్ పరికరాలతో పాటు, డోనర్లకు సంబంధించిన రికార్డులు, ఆర్థిక లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించి, సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.మహిళలను నియమించుకోవడానికి, వారిని ఫర్టిలిటీ కేంద్రాలకు పరిచయం చేయడానికి వ్యవస్థీకృత కమిషన్ విధానం ఏమైనా అమల్లో ఉందా? ఈ వ్యవహారంలో ఫర్టిలిటీ కేంద్రాల డైరెక్టర్లు, కోఆర్డినేటర్లు, ఏజెంట్ల పాత్ర ఏమిటి? అనే కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నకిలీ పత్రాలను సృష్టించి, చట్టాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపైనా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.  

🏠 Home