🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 29 November 2026, 5:01 pm Posted by : TELANGANA KERATAM

శ్రీ స్కంద క్షేత్రం మహోత్సవానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి ఆహ్వానం

News Image

శ్రీ స్కంద క్షేత్రం మహోత్సవానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి ఆహ్వానం

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 29:

కామారెడ్డి పట్టణంలోని గుమస్తా కాలనీలో ఉన్న శ్రీ కాలభైరవ వీరాంజనేయస్వామి దేవాలయంలో నిర్వహించనున్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి యంత్రకుమార్తి స్థిర ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ మహోత్సవం డిసెంబర్ 13, 2026 ఆదివారం నుండి డిసెంబర్ 15, 2026 మంగళవారం వరకు మూడు రోజులపాటు బ్రహ్మశ్రీ గంగవరం అంజనేయశర్మ గారి ఆచార్యత్వంలో ఘనంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా గుమస్తా కాలనీలో కొలువుదీరిన శ్రీ కాలభైరవస్వామి, వీరాంజనేయస్వామి భక్తుల కొంగుబంగారమై భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారని తెలిపారు. ఈ మహోత్సవంలో భాగంగా మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, హోమాలు మరియు వివిధ కార్యక్రమాలు, ఈ కార్యక్రమంలో, 1వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గడ్డమీద మహేష్, కమిటీ అధ్యక్షులు మేదాల వెంకటేశం, రాజశేఖర్, లింగం, బాలరాజ్, ప్రకాష్, మధు, ప్రసాద్ ఉన్నారు.
🏠 Home