🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 29 November 2026, 10:48 pm Posted by : TELANGANA KERATAM

శ్రీ సంకష్టహర మహా గణపతి క్షేత్రం ఆలయ కమిటీ అధ్యక్షులు బొంబోతుల రవీందర్ గౌడ్

News Image
శ్రీ సంకష్టహర మహా గణపతి క్షేత్రం ఆలయ కమిటీ అధ్యక్షులు బొంబోతుల రవీందర్ గౌడ్

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 29:

కామారెడ్డి పట్టణంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో మొట్టమొదటిసారిగా ఆలయ కమిటీ అధ్యక్షుడిని ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఎలక్షన్ అధికారులు వేణుగోపాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహించారు. ఈ ఎన్నికలలో హౌసింగ్ బోర్డు కాలనీ, లలిత నగర్, ద్వారకా నగర్,కౌండిన్య కాలానికి చెందిన సభ్యులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న బొంబోతుల రవీందర్ గౌడ్ సాయిరాము పోటీ చేయగా బొంబోతుల రవీందర్ గౌడ్ భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. భారీ మెజారిటీతో గెలుపొందిన బొంబోతుల రవీందర్ గౌడ్ ను కాలనీ కమిటీ అధ్యక్షులు చీటీ పాండురంగారావు, ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు సుతారి అంజయ్య విశ్వం గుప్త భవాని గ్రహమండలేశ్వర మహిళా సభ్యులు గణేష్ సేవాదళ్ సభ్యులు భారీ గజమాలతో సన్మానించి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బొంబోతుల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ నా మీద నమ్మకముతో శ్రీ సంకష్టహర మహా గణపతి క్షేత్రం ఆలయ కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు నాకు ఓటు వేసిన వారికి, వేయని వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. నేను కమిటీ అధ్యక్షుడు లాగా కాకుండా మీ తోటి ఒక్క సేవకుడిగా ఉండి ఆలయ అభివృద్ధికి తోడ్పడుతానని అన్నారు.
Additional News Photo
🏠 Home