కోరుట్ల వాసి డాక్టర్ వేణు మాధవ్‌కు టీ.ఎన్.చతుర్వేది అవార్డు

పేదరికాన్ని అధిగమించి జాతీయ పురస్కారం తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 31 : జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన డాక్టర్ ఎం.వేణు మాధవ్‌కు ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి డాక్టర్ టీ.ఎన్. చతుర్వేది ఉత్తమ పరిశోధనా వ్యాస పురస్కారం లభించింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎనిమిదో తరగతిలోనే చదువు ఆపేసిన ఆయన, కుటుంబ పోషణ కోసం హోటల్ కార్మికుడిగా, నిర్మాణ రంగ కూలీగా, పెయింటర్‌గా, చిరు వ్యాపారిగా పనిచేశారు. అయినప్పటికీ చదువుపై ఆసక్తితో తిరిగి విద్యాభ్యాసం కొనసాగించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. కోరుట్లలో పాఠశాల విద్యను అభ్యసించిన ఆయన, 2004లో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీలో చేరి మూడేళ్లలో పూర్తి చేశారు....