కౌలుకు ఇచ్చిన భూమిని తిరిగి ఇప్పించాలని మహిళ ఆత్మహత్య యత్నం

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 31 : తమ బంధువులకు కౌలుకు ఇచ్చిన భూమిని తిరిగి ఇప్పించాలని ఓ మహిళ ఆత్మహత్య యత్నంకు పాల్పడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, తమ భూమిని తిరిగి ఇప్పించాలని కోరుతూ విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో పేర్కొన్న వివరాల ప్రకారం..భీమారం మండలం రాగోజీపేట గ్రామానికి చెందిన బాలసాని జయ (భర్త మల్లేశం) అనే మహిళ తన స్వగ్రామంలో స్వంత బావ అయిన నారాయణ, అతని కుమారుడైన బాలసాని మారుతీలకు తమ స్వంత భూమిని కౌలుకు చేసుకునేందుకు ఇవ్వగా, వారు తనను నమ్మిచి నా యొక్క భూమిని ఆక్రమించుకున్నాడని ఆరోపించింది. ఇలా ఎందుకు చేశావు...