ఇందిరా గాంధీకి నివాళులర్పించిన భీమారం మండల కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 31 : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు భీమారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నీరటి మల్లేశం ఆధ్వర్యంలో శనివారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ . భారత దేశ తొలి మహిళా ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ దేశం కోసం సర్వస్వం ధారపోసిన మహనీయురాలు ఇందిరా గాంధీ అని కొనియాడారు. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయికరణ, 20 సూత్రాల కార్యక్రమం లాంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ ప్రగతికి, పేదల అభ్యున్నతికి ఇందిరా గాంధీ...