కోరుట్ల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీతారాణి సస్పెన్షన్
కోరుట్ల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీతారాణి సస్పెన్షన్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ సత్యప్రసాద్ అనుమతి లేకుండా గైర్హాజరు, విధుల నిర్లక్ష్యంపై సూపరింటెండెంట్ పై చర్యలు తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 31 : విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పరిపాలనా పర్యవేక్షణలో వైఫల్యం, ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన కారణాలతో కోరుట్ల ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి.సునీతారాణిని తక్షణమే సస్పెండ్ చేస్తూ, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ కోరుట్ల ఏరియా ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా, సూపరింటెండెంట్ సునీతా రాణి సంబంధిత సమర్థ అధికారి నుంచి ముందస్తు అనుమతి పొందకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు....