రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి తెలంగాణ, కెరటం,స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 31, అక్టోబర్ కొనుగోళ్లలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రైతులకు మద్దతు ధర, సకాలంలో చెల్లింపులు అందించాలి రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసి, వారికి న్యాయంగా దక్కాల్సిన మద్దతు ధర అందించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అధికారులను కోరారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని...