మనోవికాస్ పాఠశాలలో స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు.
మనోవికాస్ పాఠశాలలో స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు.... తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు... మంచిర్యాల జిల్లా.. మందమర్రి పట్టణంలోని మనోవికాస్ పాఠశాలలో భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశానుసారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సట్ల సంతోష్ గౌడ్ ,తుంగపిండి రాజేష్ మాట్లాడుతూ.. భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు....