భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో వల్లభాయ్ పటేల్ కు ఘన నివాళులు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 31 : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని భారత్ సురక్ష సమితి జగిత్యాల జిల్లా శాఖ, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తాలోని పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమితి నాయకులు ఏసిఎస్ రాజు, అక్కినపల్లి కాశీనాథం, సమరసత వేదిక కరీంనగర్ విభాగ్ సంయోజక్ చిట్ల గంగాధర్ లు మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశనికి మొదటి ఉప ప్రధానిగా, హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడని, దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత భౌగోళికంగా భారతదేశం ముక్కలు కాకుండా ఒక్కటి చేసిన మహనీయుడని కీర్తించారు. మనకు...