ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి..!బిజేవైయం కోరుట్ల పట్టణ అధ్యక్షుడు దమ్మ సంతోష్ రెడ్డి తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 31 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వరి పంట కోతలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీజేపీ యువమోర్చా కోరుట్ల పట్టణ అధ్యక్షుడు దమ్మ సంతోష్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ..రైతులు దళారులను నమ్మి తమ కష్టార్జిత ధాన్యాన్ని తక్కువ ధరలకు విక్రయించి నష్టపోవద్దని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించి, మంచి లాభాలు పొందేలా జాగ్రత్తలు...