నేషనల్ హైవే అంశంలో రైతులను అడ్డుపెట్టుకొని రఘునాథ్ రావుపై బురదజల్లడం మానుకోవాలి......
నేషనల్ హైవే అంశంలో రైతులను అడ్డుపెట్టుకొని రఘునాథ్ రావుపై బురదజల్లడం మానుకోవాలి...... బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కస్తూరి నాగరాజు...... తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు మంచిర్యాల జిల్లా.. బీఆర్ఎస్ అంటేనే అవినీతి.. బీజేపీపై అవినీతి ఆరోపణలు చేస్తే ప్రజలు నవ్వుకుంటారు. నేషనల్ హైవే అంశంలో రైతులను అడ్డుపెట్టుకొని బీజేపీ నాయకుడు రఘునాథ్ రావు గారిపై కొంతమంది దళారులు ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేయించడం మానుకోవాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కస్తూరి నాగరాజు హితవు పలికారు. శనివారం మంచిర్యాల భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రైతుల సమస్యల పరిష్కారానికి రఘునాథ్ రావు కృషి..హాజీపూర్, లక్సెట్టిపేట...