హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ కమిషనర్ వాణి

హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ కమిషనర్ వాణి రైల్వే వంతెన పనుల పరిశీలన.. బాధితులకు న్యాయం చేస్తామని హామీ వంతెన పనులు, నష్టపరిహారం అందేవరకు పోరాటం ఆగదు: అఖిలపక్ష నాయకులు (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / అక్టోబర్ 31: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్‌కేసర్‌లో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన పనులు, భూ బాధితులకు నష్టపరిహారం (టీడీఆర్‌) అందించే అంశంపై నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు కదిలారు. గతంలో అఖిలపక్ష నాయకులకు ఇచ్చిన హామీ మేరకు ఘట్‌కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి సంబంధిత శాఖల అధికారులతో కలిసి రైల్వే వంతెన నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌ అండ్‌...