పౌర హక్కులు ప్రతి ఒక్కరికీ సమానమే
పౌర హక్కులు ప్రతి ఒక్కరికీ సమానమే కోరుట్ల ఎమ్మార్వో కృష్ణ చైతన్య వెంకటాపూర్ లో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 31 : పౌర హక్కులు ప్రతి ఒక్కరికీ సమానమని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి పౌరుడు తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల మండల తహసీల్దార్ కృష్ణ చైతన్య అన్నారు. శనివారం కోరుట్ల మండలంలోని వెంకటాపూర్ గ్రామ గ్రామపంచాయతీ కార్యాలయంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మార్వో కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందని, కులం, మతం, ప్రాంతం, ఆర్థిక స్థితిగతులతో...