కామారెడ్డిలో 'వసూల్ రాజా'.. మున్సిపల్ తో పాటు పోలీస్ కేసుల్లోనూ సెటిల్మెంట్లు?

ముఖ్యమైన పాయింట్స్:కామారెడ్డిలో నిరుపేదలపై జులుం ప్రదర్శిస్తున్న 'వసూల్ రాజా' వ్యవహారం చర్చనీయాశంగా మారింది. అధికారుల అండదండలతో రెచ్చిపోతున్నట్లు చర్చ జరుగుతోంది. కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో వసూల్ రాజా అరాచకాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. మున్సిపల్ వ్యవహారాల్లోనే కాకుండా పోలీస్ కేసుల్లోనూ సెటిల్మెంట్లు చేస్తూ జేబులు నింపుకోవడంతో పాటు క్రమంగా వసూళ్లకు పాల్పడుతూ దర్జాగా సెటిల్మెంట్లు చేస్తున్నాడన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారుల అండదండలతో కొందరు మీడియా ప్రతినిధుల సహకారంతో రెచ్చిపోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఫిర్యాదులు ఇప్పించి ఆపై అధికారులు, నాయకులు, మీడియా ప్రతినిధుల పేర్లు చెప్పి లక్షల్లో దండుకుంటున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చోరీ కేసులో మధ్యవర్తిత్వం.. మీడియాకు మామూళ్లు కామారెడ్డి రూరల్ సర్కిల్ పరిధిలో...