బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు అనుమతి లేకుండా డ్రోన్ల వినియోగం, డీజే సౌండ్స్‌పై కఠిన చర్యలు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.... తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు..... రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజల శాంతిభద్రతలు, భద్రత మరియు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అనుమతి లేకుండా డీజే సౌండ్స్ వినియోగించడం, డ్రోన్లను ఉపయోగించడం, అలాగే అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్...