రక్తదానం చేయండి... ప్రాణదాతలుగా నిలవండి: మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్
రక్తదానం చేయండి... ప్రాణదాతలుగా నిలవండి: మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు మంచిర్యాల జిల్లా....పోలీసు అమరవీరుల స్ఫూర్తితో ప్రజాసేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాల పోలీసుల ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఎన్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని డీసీపీ శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పోలీసు అమరవీరులు ప్రజల హక్కుల పరిరక్షణతో పాటు ప్రజల ధన, మాన,ప్రాణాల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని తెలిపారు.వారి త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా మరింత అంకితభావంతో ప్రజలకు సేవలందించాలనే...